కరీంనగర్ జిల్లాలో, భీమదేవరపల్లి
కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా సాగంటి వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయనను 57 ఉప కులాల హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లంపల్లి శ్యామ్, షైనీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ పీ. ఈటి ఎర్ర రఘురాం, గోసంగి కుల సంక్షేమ సంఘం సభ్యులు గొర్రె ప్రేమ్చంద్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భీమదేవరపల్లి వాస్తవ్యులు జోగు రాజు, సాతూరి అభిలాష్, కర్ర మహిపాల్ రెడ్డి, గుడి కందుల రజనీకాంత్ కూడా పాల్గొన్నారు.