కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామంలోని అలివేలు మంగ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. కళ్యాణం తర్వాత అన్నదానం కార్యక్రమం నిర్వహించగా, వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.