వీఓఏల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: సీపీఎం డిమాండ్

1చూసినవారు
వీఓఏల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి: సీపీఎం డిమాండ్
బోయినపల్లి మండల కేంద్రంలో పది రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల (వీఓఏ)ను సీపీఎం పార్టీ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. వీఓఏల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు కోరారు. వీఓఏలకు కనీస వేతనం రూ. 20,000, SERP ఉద్యోగులుగా గుర్తించి HR పాలసీ వర్తింపజేయాలని, అర్హులైన వారికి సీసీలుగా పదోన్నతి కల్పించాలని, రూ. 20 లక్షల వరకు సాధారణ, ఆరోగ్య బీమా, ట్యాబ్, నెట్ సౌకర్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గురిజాల శ్రీధర్, మంత్రి మణెమ్మ, కొనుగటి భాగ్యలక్ష్మి, గుండెల్లి వరలక్ష్మి, మహేందర్, మమత, అపర్ణ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you