ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామాల్లో కోతులు, కుక్కల బెడద తీవ్రమైంది. ఇళ్లల్లోకి చొరబడి, వాటిని తరమడానికి వెళ్లిన వారిపై దాడులకు పాల్పడుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో నివారణ హామీలు ఇచ్చిన నాయకులు వాటిని మరచిపోయారు. కొన్ని గ్రామాల్లో కొండెంగలను తిప్పడం, చింపాంజీ, ఎలుగుబంటి వేషాలు ధరించి కోతులను తరమడం వంటి వింత పద్ధతులు అవలంబిస్తున్నా, అధిక శాతం గ్రామాల్లో నివారణ చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.