కోతుల దాడి భయంతో.. జారిపడి మహిళ మృతి

12చూసినవారు
కోతుల దాడి భయంతో.. జారిపడి మహిళ మృతి
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్ లో బుధవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. ఇంటి వద్ద కోతులు బీభత్సం సృష్టించడంతో, అవి ఇంట్లోకి వస్తాయేమోనన్న భయంతో కేసిరెడ్డి విమల (59) వాటిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె అదుపుతప్పి గచ్చు నేలపై పడటంతో తలకు తీవ్ర గాయమైంది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మరణించారు.

సంబంధిత పోస్ట్