తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణక్క కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, సూడా చైర్మన్ కొమిటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, వివిధ జిల్లాల మహిళా అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళల అభ్యున్నతికి కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.