
ఒకే రోజు 12 షార్ట్ఫిల్మ్స్లో నటించిన అమితాబ్ బచ్చన్
వయసు కేవలం సంఖ్య మాత్రమేనని, పనిపై ఆసక్తి ఉంటే అలసట ఉండదని బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నిరూపించారు. 80 ఏళ్లు దాటినా, కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో ఒకేరోజు 12 షార్ట్ఫిల్మ్స్, 2 స్టిల్ షూట్ల చిత్రీకరణను పూర్తి చేశారు. ఈ విషయాన్ని ఆయన తన బ్లాగ్లో వెల్లడించారు. పనిపై అంకితభావం, పరిస్థితులకు తగ్గట్టుగా నేర్చుకోవడం, రాజీ పడకపోవడం వంటి అంశాలను ఆయన తన బ్లాగ్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 AD’ సీక్వెల్ షూటింగ్లో బిజీగా ఉన్నారు.




