కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ రఫీక్ ఖాన్ ను సీసీఆర్బీకి అటాచ్ చేశారు. మూడు రోజుల క్రితం జగిత్యాల వీఆర్ నుంచి కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. బుధవారం బాధ్యతలు స్వీకరించిన ఆయన, రెండు రోజుల వ్యవధిలోనే డీసీఆర్బీ విభాగానికి బదిలీ కావడం చర్చనీయాంశమైంది. దీనికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అదేవిధంగా, తిమ్మాపూర్ సర్కిల్లో పనిచేస్తున్న ఓ అధికారిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సీపీ కార్యాలయానికి అటాచ్ చేయడం కూడా చర్చకు దారితీసింది.