కరీంనగర్ మానేరు వాగు బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువకుడు మృతిచెందిన విషయం తెలిసిందే. తన కొడుకు రవీందర్ మృతికి ముగ్గురు స్నేహితుల వేధింపులే కారణమని మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అవసరం లేకున్నా రవీందరు డబ్బులు ఇచ్చి వేధింపులకు గురిచేశారని, అందుకే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని బాధిత తల్లి విజయ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు శనివారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.