Dec 22, 2025, 07:12 IST/
లక్షల విలువైన కంచి పట్టు చీర: గిన్నిస్ రికార్డు సృష్టించిన కళాఖండం
Dec 22, 2025, 07:12 IST
చెన్నై సిల్క్ కంజీవరం పట్టు చీర గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. డబుల్ వార్ఫ్ పద్ధతిలో చేతితో నేసిన ఈ చీరలో 64 రంగుల షేడ్స్, పది ప్రత్యేక డిజైన్లు ఉన్నాయి. 8 కిలోల బరువున్న ఈ చీరలో బంగారం, వజ్రం, ప్లాటినం, వెండి, కెంపు, పచ్చ, నీలమణి, ముత్యాలు వంటి విలువైన రాళ్లను పొందుపరిచారు. జనవరి 05, 2008న సుమారు రూ. 39 లక్షలకు పైగా అమ్ముడుపోయిన ఈ చీర తయారీకి 4 వేల గంటలు, 36 మంది నేత కార్మికుల కృషి అవసరమైంది. ఇందులో ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవి వర్మ 11 చిత్రాల ప్రతిరూపాలు ఉన్నాయి.