వరంగల్ విమానాశ్రయానికి దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలని ప్రజావాణిలో వినతి

2చూసినవారు
వరంగల్ విమానాశ్రయానికి దొడ్డి కొమరయ్య పేరు పెట్టాలని ప్రజావాణిలో వినతి
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణ ఎంపీడీవో కార్యాలయం ప్రజావాణిలో సోమవారం కురుమ సంఘం ఆధ్వర్యంలో వరంగల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య  పేరు నామకరణం చేయాలని కురుమ సంఘం నాయకులు ప్రజావాణి కార్యక్రమంలో ఉన్నత అధికారులకు వినతి పత్రం అందించారు. అనంతరం కురుమ సంఘం నాయకులు కోట రమేష్ మాట్లాడుతూ వరంగల్ లో అంతర్జాతీయ విమానాశ్రయానికి తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య తెలంగాణ తొలి అమరుడైన వారి పేరు పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కురుమ సంఘ రాష్ట్ర నాయకులు కోట రమేష్, కోట నర్సింలు, గడ్డం మల్లేష్, కోట కుమార్, ముద్దుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్