కోరుట్ల: రౌడీ షీటర్ ముఠా అరెస్ట్

52చూసినవారు
కోరుట్ల: రౌడీ షీటర్ ముఠా అరెస్ట్
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి పరిసర ప్రాంతాలలో అక్రమ ఇసుక, మొరం రవాణా, భూమి సెటిల్‌మెంట్ దందాలు చేస్తూ, వారి అక్రమాల పై ఎదురు తిరిగిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్న రౌడీ షీటర్ ముఠాను మెట్‌పల్లి సీఐ నిరంజన్ రెడ్డి మంగళవారం అరెస్టు చేశారు. రెంజర్ల సతీష్, బత్తుల భరత్, జెట్టి లక్ష్మణ్ లను అరెస్ట్ చేశారు. ఎన్నం రమేష్ పరారీ లో ఉన్నాడని వివరించారు.

సంబంధిత పోస్ట్