జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని మల్లాపూర్ మండల కేంద్రంలో ఎల్లమ్మ చెరువు వద్ద శుక్రవారం ట్రాక్టర్ తో భూమి చదును చేస్తుండగా ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో మాట్ల చిన్న పెద్దులు అనే వ్యక్తి మృతి చెందాడు. వ్యవసాయ పనుల కోసం చదును చేస్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికులు బావి నుండి ట్రాక్టర్ ను, మృతదేహాన్ని బయటికి తీసారు.