జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల శిథిలావస్తలో ఉన్నందున భవన కూల్చివేత పనులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం పరిశీలించారు. విద్యార్థులకు తాత్కాలికంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అకామిడేషన్ ఏర్పాట్లను చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ మోహన్, ఎమ్మార్వో శ్రీనివాస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.