మెట్పల్లి పట్టణంలోని నరేందర్ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో స్వర్గీయ మాజీమంత్రి జువ్వాడి రత్నాకర్ రావు స్మారకార్థం, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు ఆధ్వర్యంలో జనవరి 4 ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం మెట్పల్లి పట్టణ జువ్వాడి భవన్‌లో మెగా జాబ్ మేళా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో నిర్వహించబడుతోంది.