గిరిజనులకు పెరటి కోళ్ల పెంపకంపై శిక్షణ

19చూసినవారు
గిరిజనులకు పెరటి కోళ్ల పెంపకంపై శిక్షణ
కోరుట్లలోని పీవీ నర్సింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి సహకారంతో ఎస్టీ లబ్ధిదారులకు పెరటి కోళ్ల పెంపకం, కోళ్లకు ఇంటి వద్దనే దాణా తయారీపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కోళ్ల పెంపకం ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునే విధానాలు, తక్కువ ఖర్చుతో దాణా తయారీపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా గిరిజన సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షులు, రాజారాం తండా సర్పంచ్ భూక్యా తిరుపతి నాయక్, గిరిజన సంఘం అధ్యక్షులు ప్రకాష్ నాయక్, రవి నాయక్, శ్రీనివాస్, ప్రకాష్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్