కొడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడును బలవంతంగా లాక్కెళ్లిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నవంబర్ 3న గంగారం తండాకు చెందిన అజ్మీర దూరి (50) సూరంపేట గ్రామ శివారులోని ఐకేపీ కేంద్రానికి వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి పుస్తెలతాడును అపహరించారు. పోలీసులు దర్యాప్తు చేసి నవంబర్ 4న నాచుపల్లి ఇటుక బట్టీల సమీపంలో నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి బంగారు పుస్తెలతాడు, చోరీకి ఉపయోగించిన హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు మల్యాల సీఐ రాజ్‌కుమార్ తెలిపారు.