Feb 17, 2026, 15:02 IST/
ఈ నెల 23న కేబినెట్ భేటీ.. MPTC, ZPTC ఎన్నికలపై చర్చ!
Feb 17, 2026, 15:02 IST
TG: పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు పూర్తి కావడంతో ఇప్పుడు అందరి దృష్టి పరిషత్ ఎన్నికలపై పడింది. అయితే MPTC, ZPTC ఎన్నికల కోసం రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ అధ్యక్షతన ఈ నెల 23న మంత్రి వర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కేబినెట్ భేటీలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతోపాటు GHMC ఎన్నికల నిర్వహణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ సర్కార్.. అదే ఊపులో పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం.