Mar 07, 2026, 09:03 IST/కరీంనగర్
కరీంనగర్
కాళేశ్వరం పనికిరనప్పుడు నీటిని ఎలా తరలిస్తున్నారు హరీశ్ రావు
Mar 07, 2026, 09:03 IST
కరీంనగర్ జిల్లా కురిక్యాల వద్ద వరద కాలువను పరిశీలించిన మాజీ మంత్రి హరీశ్‌రావు, కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని గతంలో విమర్శించిన ముఖ్యమంత్రి, ఇప్పుడు అదే ప్రాజెక్టు నీటిని ఎలా తరలిస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ నీళ్లతో రైతులు పంటలు పండించడం లేదన్న తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. మోటర్లు ఆన్ చేసి నీటిని ఎందుకు విడుదల చేస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు.