మానకొండూర్ - Manakonduru

మానకొండూర్ లో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం

మానకొండూర్ లో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం

రాజన్న సిరిసిల్ల జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, ఇల్లంతకుంట మండలంలో మంగళవారం, 11/11/2025న భారత స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని "జాతీయ విద్యా దినోత్సవం"గా ఘనంగా నిర్వహించారు. ఇల్లంతకుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ దేవరాజం అధ్యక్షత వహించారు. ఆజాద్ చిత్రపటానికి నివాళులర్పించి, ఆయన విద్యా సేవలను, దేశానికి చేసిన కృషిని విద్యార్థులు, ఉపాధ్యాయులు స్మరించుకున్నారు. విశ్వవిద్యాలయాల స్థాపన, జాతీయ విద్యా విధానాల రూపకల్పనలో ఆయన పాత్ర అపారమని, విద్య ద్వారా సమాజ ప్రగతి సాధ్యమని ప్రిన్సిపల్ తెలిపారు. ఆజాద్ జీవితం విద్యా ప్రేరణకు ప్రతీక అని, స్వాతంత్ర్య సమరంలో ఆయన సేవలు చిరస్మరణీయమని లెక్చరర్లు కొనియాడారు.

వీడియోలు


కరీంనగర్ జిల్లా