రెండో రోజుకు చేరిన అక్కేం నాగరాజు ఆమరణ నిరాహార దీక్ష

2చూసినవారు
రెండో రోజుకు చేరిన అక్కేం నాగరాజు ఆమరణ నిరాహార దీక్ష
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం ఆనంతారం గ్రామంలో అసంపూర్తిగా ఉన్న ఆనంతారం బిక్క వాగు వంతెన పనులు వెంటనే పూర్తి చేయాలని యువజన నాయకుడు అక్కేం నాగరాజు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మంగళవారంకు రెండో రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు పార్టీలకతీతంగా వివిధ పార్టీల నాయకులు, యువకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో కముటం రాములు, చొప్పరి రాంచంద్రం, వొళ్ళాల రవి, ఆకుల శ్రీనివాస్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్