
ఆర్థిక నేరాల శిక్షల తగ్గింపు.. లోక్‌సభలో నిర్మలా సీతారామన్ ప్రకటన
ఆర్థిక నేరాలకు విధించే జరిమానా, శిక్షల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక నేరాల్లో శిక్షలు తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రకటించారు. పన్ను వివాదాల్లో క్రిమినల్ చర్యల తీవ్రత తగ్గిస్తూ, జైలుశిక్ష రెండేళ్లకు పరిమితం చేస్తున్నట్లు తెలిపారు. జరిమానా చెల్లిస్తే రెండేళ్ల జైలుశిక్ష కూడా మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి వస్తుందని, సరళీకృత ఫారాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు.




