ఇల్లంతకుంటలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

0చూసినవారు
ఇల్లంతకుంటలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
ఇల్లంతకుంట మండలంలో శనివారం రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బస్టాండ్ ఆవరణలో చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం అధ్యక్షుడు లింగంపల్లి రవి, గ్రామ సర్పంచ్ ఏం రాజు, రజక సంఘం సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన ధైర్య సాహసాలు చరిత్రలో నిలిచిపోతాయని, భూమి కోసం, హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్