కరీంనగర్ జిల్లా, మానకొండూర్, శంకరపట్నం మండలం 1992–93 బ్యాచ్ క్లాస్మేట్స్ ఆదివారం అంబాలాపూర్ సర్పంచ్ వడ్లకొండ వెంకటేశ్, ఎరడపల్లి సర్పంచ్ రజిత అశోక్‌లను ఘనంగా సన్మానించారు. ప్రజల విశ్వాసంతో సర్పంచులుగా ఎన్నికై గ్రామాభివృద్ధికి సేవలందిస్తున్నందుకు వారిని అభినందించారు. చిన్ననాటి మిత్రులు ప్రజాసేవలో కొనసాగడం తమ బ్యాచ్‌కు గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓడ్నాల లక్ష్మణ్, పాండ్రాల తిరుపతి, వెంగళ రాజు తదితరులు పాల్గొన్నారు.