మొన్నటి వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి 50వేల రూపాయల పరిహారం చెల్లించాలని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఆమె ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం తడిసినా, మొలకెత్తినా, బూజు పట్టినా ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి దెబ్బతిన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆమె కోరారు. జిల్లాలో కోతలు ప్రారంభమై నెల కావస్తున్నా కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభించడం లేదని ఆమె ప్రశ్నించారు.