
ఇరాన్ అణు ముప్పు తొలగిస్తాం: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ అణు ముప్పును తొలగిస్తామని శపథం చేశారు. ఇరాన్ అమెరికా హెచ్చరికలను ధిక్కరించి, అణు కార్యక్రమాలను ఆపలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అవసరమైతే భూతల దాడులు చేస్తామని, అమెరికా దళాలను మోహరిస్తామని హెచ్చరించారు. ఇరాన్ వద్ద అమెరికాను చేరుకోగల క్షిపణులు ఉన్నాయని, కానీ అలా జరగనివ్వనని, ఈ ప్రభుత్వంపై దాడి చేయడానికి ఇదే చివరి అవకాశమని అన్నారు. ఈ ఆపరేషన్ ఐదు నుంచి ఏడు వారాలు కొనసాగవచ్చని, ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాలను నిర్మూలించడమే లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు.




