కరీంనగర్ జిల్లా, మానకొండూర్ మండలంలోని కరీంపేట గ్రామానికి చెందిన కౌలు రైతు వనపర్తి ఐలయ్య, రజినీల కుమార్తె వనపర్తి సిరి చందన, బుధవారం వెలువడిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో 569 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచింది. నిరుపేద రైతు కుటుంబం నుండి వచ్చిన సిరి చందన, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కష్టపడి చదివి ఈ విజయం సాధించింది. ఆమె ప్రతిభ పట్ల గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందించి హర్షం వ్యక్తం చేస్తున్నారు.