రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.1.25 లక్షల ఆర్థిక సాయం

120చూసినవారు
రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.1.25 లక్షల ఆర్థిక సాయం
సిద్దిపేట జిల్లా మానకొండూర్ నియోజకవర్గం బెజ్జంకి మండలం ముత్తన్నపేట గ్రామానికి చెందిన బొర్ర రాజు రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు శ్రీ వోరగంటి ఆనంద్, వైద్య ఖర్చుల నిమిత్తం 1,25,000 రూపాయల LOC పత్రాన్ని రాజుకు అందజేశారు. ఈ LOC మంజూరుకు సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, రాజు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్