ఇల్లంతకుంట మండలం ఆరేపల్లి గ్రామంలో సోమవారం ఉపసర్పంచ్ గుడి కందుల భూమిరెడ్డి మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి సుద్దాల దేవయ్య పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దామెర సత్యం, అన్నాడి నరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి, బద్దం హనుమంత రెడ్డి, ఎల్లోజీ, కంటం రాజిరెడ్డి, సర్పంచ్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.