శంకరపట్నం మండలం ఆముదాలపల్లికి చెందిన గజముఖ ఫ్రెండ్స్ యూత్, వినాయక చవితి సందర్భంగా ఆదివారం జమ్మికుంటలోని స్పందన అనాథ ఆశ్రమంలో అనాథ పిల్లలకు అన్నదానం చేసింది. ఆకలి తీర్చడమే నిజమైన మానవత్వమని చాటుతూ, యువత స్వయంగా భోజనం వడ్డించి, వారి ఆకలి తీర్చారు. ఈ వినూత్న సేవా కార్యక్రమాన్ని అనాథాశ్రమంలోని వారు అభినందించారు.