కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం జగ్గయ్యపల్లి శివారులో రామగుండం నుండి హైదరాబాద్కు మంచినీటిని తరలించే HMWS ప్రధాన పైపులైన్ శుక్రవారం (జనవరి 2, 2026) భారీ ప్రమాదానికి గురైంది. మానేరు వాగు ఒడ్డున అకస్మాత్తుగా పగిలిన పైపు నుండి నీరు భారీ ఎత్తున ఆకాశంలోకి ఎగిసిపడుతోంది. నీటి ఒత్తిడికి సమీపంలోని తాటి చెట్టు నేలకూలింది. ప్రమాదాన్ని నివారించేందుకు అధికారులు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.