రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ ఆదేశాలు

1చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ ఆదేశాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం డిసెంబర్ 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు. ఈ కాలంలో పోలీసుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించరాదని, నిబంధనలకు విరుద్ధంగా డి.జే.లు వినియోగించరాదని ఆయన సూచించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే లేదా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చట్టవ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించారు. జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.

సంబంధిత పోస్ట్