ముగిసిన కరీంనగర్ బీజేపీ శిక్షణ తరగతులు

1చూసినవారు
ముగిసిన కరీంనగర్ బీజేపీ శిక్షణ తరగతులు
తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి శ్రీ చైతన్య కళాశాలలో బీజేపీ నిర్వహించిన 'పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్' రెండు రోజుల శిక్షణ తరగతులు ఆదివారం ముగిశాయి. ఈ శిక్షణలో మొత్తం 12 సెషన్లలో 346 మంది పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడంపై కీలక నేతలు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మేయర్ కోలగని శ్రీనివాస్ తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్