కరీంనగర్: వడ్ల దొంగతనం కలకలం

1చూసినవారు
కరీంనగర్: వడ్ల దొంగతనం కలకలం
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లి స్టేజీ సమీపంలోని రంగపేట ఐకేపీసెంటర్ వద్ద అర్ధరాత్రి వడ్ల దొంగతనం జరిగింది. రైతులు గోపు శ్రీనివాస్ రెడ్డి, సల్ల రాజిరెడ్డిలకు చెందిన వడ్ల కుప్పల నుంచి సుమారు 20 సంచులు ఎక్కించే ప్రయత్నం చేస్తుండగా, అప్రమత్తమైన రైతులు ఒక దొంగను పట్టుకొని గ్రామస్తుల సహాయంతో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న మరో దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టుబడ్డ దొంగ మానకొండూరు ప్రాంతానికి చెందిన జహీదాగా గుర్తించారు. గోపు శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్