కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

3చూసినవారు
కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ముక్కెర నరేష్ (26) మంగళవారం రాత్రి కొడిమ్యాల మండలం దమ్మయ్య పేట నుంచి తిరుగు ప్రయాణంలో మల్యాల మండలం గొర్రెగుండెం వద్ద బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ఘటనలో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. కుమారుడి పుట్టు వెంట్రుకల శుభకార్యం కోసం బంధువులను ఆహ్వానించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతని మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

సంబంధిత పోస్ట్