మానసా దేవి క్షేత్రంలో కార్తీక దీపారాధన: భక్తులకు ఏర్పాట్లు

0చూసినవారు
గన్నేరువరం మండలంలోని కాసింపేట గ్రామంలోని మానసా దేవి మహా క్షేత్రంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు 108 శివ లింగాలకు క్షీరాభిషేకం చేశారు. ఆలయ పూజారి పెండ్యాల అమర్నాథ్ శర్మ మాట్లాడుతూ, కార్తీకమాసంలో దీపారాధన చేస్తే కోరికలు తీరుతాయని తెలిపారు. ఆలయంలో కుంకుమ పూజలు, అమ్మవారికి క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :