కరీంనగర్ జిల్లా శంకర్పట్నం మండలం తాడికల్ గ్రామ సర్పంచ్ దుర్గపు సుజాత ఇటీవల మృతి చెందడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. సుజాత చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. పార్టీకి, గ్రామ అభివృద్ధికి ఆమె చేసిన సేవలను గుర్తుచేశారు. ఆమె పిల్లల చదువుల వివరాలు తెలుసుకుని, బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.