హుజరాబాద్ మున్సిపల్ పరిధిలో గురువారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిర్వహించిన బిజెపి విజయసంకల్ప సభకు హుజురాబాద్ లోని ఐదవ వార్డు ప్రజలు బిజెపి అభ్యర్థి భూసమల స్రవంతికి మద్దతుగా భారీగా తరలివచ్చారు. మోడి పాలనలో బండి సంజయ్ సారధ్యంలో హుజురాబాద్ అభివృద్ధి చెందుతుందని ప్రజలు నమ్ముతున్నామని, హుజురాబాద్ లో బిజెపి గెలుపు తగ్గిందాని బూసమల్ల స్రవంతి పేర్కొన్నారు. ఈ సభలో ప్రజల స్పందన బీజేపీకి అనుకూలంగా ఉంది.