ఇల్లంతకుంట మండలం కందికట్కూరుకు చెందిన పూజ భవాని అనే గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవం జరిగింది. ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఈ వివరాలను వెల్లడించారు.