వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు: 16 మందికి గాయాలు

7చూసినవారు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి వద్ద రాజీవ్ రహదారిపై వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ తో పాటు బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ, క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మెట్పల్లి డిపోకు చెందిన ఈ బస్సు హైదరాబాద్ నుంచి మెట్పల్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్