ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి గ్రామంలో చేయూత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇంటింటికీ వెళ్లి శుక్రవారం నాడు ఏపీఎం కుమారస్వామి పరిశీలించారు. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వివరాలను పరిశీలించి, అర్హతకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పారదర్శకంగా నమోదు చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, జీపీ కార్యదర్శి, సిసిలు, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.