రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధ్యక్షతన ప్రభుత్వ శాఖల సిబ్బంది సాధారణ బదిలీల ప్రక్రియ నిబంధనల ప్రకారం జరిగింది. ఐడిఓసి లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది వివరాలను కలెక్టర్‌కు అందజేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా బదిలీలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రక్రియలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.