వర్షానికి వంతెనపై వడ్ల కుప్పలు నీట మునిగాయి

3చూసినవారు
బెజ్జంకి మండలం దేవక్కపల్లి- వరికొలు వంతెనపై రైతులు పోసిన వడ్ల కుప్పలు రాత్రి కురిసిన భారీ వర్షాలకు అకస్మాత్తుగా వాగు ప్రవహించడంతో నీట మునిగాయి. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. వడ్లు కొట్టుకపోకుండా ట్రాక్టర్లతో వంతెనపై నుంచి తరలించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, కొంతమంది రైతుల వడ్లు వాగులో కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్