రంగపేటలో అర్ధరాత్రి వడ్ల దొంగతనం: రైతులు అడ్డుకుని ఒకరిని పట్టుకున్నారు

5254చూసినవారు
రంగపేటలో అర్ధరాత్రి వడ్ల దొంగతనం: రైతులు అడ్డుకుని ఒకరిని పట్టుకున్నారు
మానకొండూర్ మండలం రంగపేటలో అర్ధరాత్రి ఐకేపీ సెంటర్ వద్ద వడ్ల దొంగతనం కలకలం సృష్టించింది. టాటా ఏసీ వాహనంలో సుమారు 20 వడ్ల సంచులు ఎక్కిస్తున్న దొంగలను రైతులు అడ్డుకున్నారు. ఒక దొంగను పట్టుకుని గ్రామస్థులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పట్టుబడ్డ దొంగ మానకొండూర్‌కు చెందిన జహీద్‌గా గుర్తించారు. రైతుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పారిపోయిన మరో దొంగ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.