మానకొండూర్ నియోజకవర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని, మండల
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రాజు,ఒగ్గు రమేష్, మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య, నాయకులు చిట్టి ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.