
పెద్దపల్లి: క్షుద్ర పూజల కలకలం
పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని కూచిరాజ్పల్లి గ్రామంలో ప్రధాన రహదారిపై క్షుద్రపూజలు చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. గుమ్మడికాయలు, నిమ్మకాయలు, కుంకుమ, ఇతర పూజా సామగ్రితో రోడ్డు నిండిపోవడంతో వాహనదారులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గురువారం అమావాస్య కావడంతో గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఈ పూజలు చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. నేటి సాంకేతిక యుగంలోనూ మూఢనమ్మకాలను కొందరు పాటించడంపై చర్చ జరుగుతోంది.






































