సుల్తానాబాద్: గ్రంథాలయానికి 72 పుస్తకాల పంపిణీ

50చూసినవారు
సుల్తానాబాద్: గ్రంథాలయానికి 72 పుస్తకాల పంపిణీ
సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలోని గ్రంథాలయానికి 72 పుస్తకాలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్ గురువారం అందజేశారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్ ఇటీవల గర్రెపల్లి గ్రంథాలయాన్ని సందర్శించగా, నిరుద్యోగులు, గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు పుస్తకాలు కావాలని కోరారు. దీంతో వెంటనే స్పందించిన చైర్మన్ జిల్లా గ్రంథాలయ శాఖ ద్వారా పుస్తకాలను అందించి, పాఠకులు వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్