జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష నిబంధనల ప్రకారం ఎన్నికల విధులు కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశించారు. మంగళవారం పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణలో ఆయన పాల్గొన్నారు. నామినేషన్ స్వీకరణకు మండల కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో కౌంటర్లు ఏర్పాటు చేసి ఎంపిటిసి స్థానాలకు నామినేషన్లు స్వీకరించాలని సూచించారు.