రైతులకు ధాన్యం అమ్ముకోవడంలో ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం మంథని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఖరీఫ్ సీజన్ లో రైతులకు బోనస్ చెల్లించామని, ఈసారి కూడా యధావిధిగా రైతులకు సన్న వడ్లకు బోనస్ అందుతుందని, కాంగ్రెస్ అంటేనే రైతు పక్షపాత ప్రభుత్వమన్నారు.