పెద్దపల్లి జిల్లాలోని అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 16వ తేదీ సోమవారంలోగా పూర్తి స్థాయిలో విద్యార్థులకు ఉచిత పాఠ్య, నోటు పుస్తకాలను అందించాలని జిల్లా విద్యాశాఖాధికారి మాధవి తెలిపారు. ఈ మేరకు మండల విద్యాధికారులు, పాఠశాలల ప్రదానోపాధ్యాయుల తగు చర్యలు గైకొనాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1, 72, 348 పాఠ్య పుస్తకాలు ఇప్పటికే పాఠశాలలకు చేరుకోగా, ఇప్పటి వరకు 50, 668 విద్యార్థులకు పంపిణీ చేసినట్టు తెలిపారు.